మహారాష్ట్ర సీఎంకు స్వల్పగాయాలు | Furthermore Maharashtra cm small Injuries | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర సీఎంకు స్వల్పగాయాలు

Apr 21 2014 3:12 AM | Updated on Oct 8 2018 5:57 PM

పృమహారాష్ట్ర ముఖ్యమంత్రి థ్వీరాజ్ చవాన్ వెళుతున్న కాన్వాయ్ శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సీఎం చవాన్‌తోపాటు ఆయన కార్యదర్శి, మరో పోలీసు అధికారికి స్వల్పగాయాలయ్యాయి.

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వెళుతున్న కాన్వాయ్ శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సీఎం చవాన్‌తోపాటు ఆయన కార్యదర్శి, మరో పోలీసు అధికారికి స్వల్పగాయాలయ్యాయి. మీరారోడ్‌లో జరగనున్న ఎన్నికల ప్రచారసభలో పాల్గొనేందుకు వెళుతుండగా రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రెస్ సమీపంలోని సిగ్నల్‌వద్ద కాన్వాయ్‌లోని పైలట్ కారును.. అదుపుతప్పి వచ్చిన ఓ వాహనం ఢీకొంది. దీంతో పైలట్ వాహనం వెనుక వస్తున్న మిగతా వాహనాల డ్రైవర్‌లందరూ సడన్‌బ్రేక్ వేశారు. ఫలితంగా కాన్వాయ్‌లోని వాహనాలన్నీ ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఇందులో చవాన్ వాహనమూ ఉంది. ఈ ఘటనలో కారులో కూర్చున్న చవాన్, ఆయన కార్యదర్శి స్వల్పంగా గాయపడ్డారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement