లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ల పర్వానికి బుధవారం తెరపడింది. మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ ఘట్టం పూర్తయింది.
ఏలూరు, న్యూస్‌లైన్: లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ల పర్వానికి బుధవారం తెరపడింది. మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ ఘట్టం పూర్తయింది. ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాలు, 15 అసెంబ్లీ సెగ్మెం ట్లలో మొత్తం 192 మంది అభ్యర్థులు రంగంలో మిగిలారు. రెండు లోక్‌సభ స్థానాల్లో 29 మంది అభ్యర్థులు రేసులో నిలిచారు. 15 అసెంబ్లీ స్థానాల్లో 163 మంది బరిలో మిగిలారు. నరసాపురం పార్లమెంటరీ స్థానంలో వంక రవీంద్రనాథ్‌కు డమ్మీ అభ్యర్థి వంక రాజకుమారి, స్వతంత్ర అభ్యర్థి సత్తి సూర్యనారాయణరెడ్డి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ స్థానం నుంచి 14 మంది బరిలో నిలిచారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో 15 మంది బరిలో ఉన్నారు. రెండు ఏంపీ స్థానాలకు 37మంది, అసెంబ్లీ స్థానాలకు 247 మంది నామినేషన్లు దాఖలు చేసిన విషయం విది తమే. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం రిట ర్నింగ్ అధికారులు అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.