రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్, కమిషనర్లు హెచ్‌ఎస్ బ్రహ్మ, డాక్టర్ నాసిమ్ జైదీతో పాటు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్సీ శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్, కమిషనర్లు హెచ్‌ఎస్ బ్రహ్మ, డాక్టర్ నాసిమ్ జైదీతో పాటు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్సీ శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో వీరికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్వాగతం పలికారు. శనివారం జూబ్లీహాల్‌లో ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం కానుంది.
ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఇందులో చర్చిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలు, పోలింగ్ రోజుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కమిషన్ సమావేశం అవుతుంది. అనంతరం 4.30 గంటల వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, డీజీపీ ప్రసాదరావు, హోంశాఖ ముఖ్యకార్యదర్శితో కమిషన్ సమావేశమవుతుంది.