కేసీఆర్.. అలీబాబా చాలీస్‌చోర్: విజయశాంతి | don't believe kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్.. అలీబాబా చాలీస్‌చోర్: విజయశాంతి

Apr 21 2014 2:37 AM | Updated on Aug 15 2018 9:06 PM

కేసీఆర్.. అలీబాబా చాలీస్‌చోర్: విజయశాంతి - Sakshi

కేసీఆర్.. అలీబాబా చాలీస్‌చోర్: విజయశాంతి

‘ కేసీఆర్ ఒక అలీబాబా చాలీస్‌చోర్.. టీఆర్‌ఎస్‌కు ఓటువేస్తే దొంగోడి చేతికి తాళం చెవి ఇచ్చినట్లే’ అని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి అన్నారు.

 సాక్షి, సంగారెడ్డి: ‘ కేసీఆర్ ఒక అలీబాబా చాలీస్‌చోర్.. టీఆర్‌ఎస్‌కు ఓటువేస్తే దొంగోడి చేతికి తాళం చెవి ఇచ్చినట్లే’ అని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి అన్నారు. ఆదివారం ఆమె మెదక్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ‘దొరా.. నీ కాల్మొక్తా’ అని ప్రజలు వేడుకోవాల్సిన రోజులు వస్తాయన్నారు. ఉద్యమాల పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుంది అంతా ఇంత కాదని ఆరోపించారు. దొరల తెలంగాణ కన్నా సీమాంధ్రతో కూడిన తెలంగాణే నయమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement