‘దొరతనంలేని తెలంగాణ తెచ్చుకుందాం’ | Damodara Rajanarasimha comments in Jogipet | Sakshi
Sakshi News home page

‘దొరతనంలేని తెలంగాణ తెచ్చుకుందాం’

Mar 28 2014 6:17 PM | Updated on Sep 2 2017 5:18 AM

‘దొరతనంలేని తెలంగాణ తెచ్చుకుందాం’

‘దొరతనంలేని తెలంగాణ తెచ్చుకుందాం’

దొరతనం పారదోలే తెలంగాణను ప్రజలు, యువత కోరుకుంటున్నారని, అందుకు అందరం కృషి చేద్దామని మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహ అన్నారు.

జోగిపేట: దొరతనం పారదోలే తెలంగాణను ప్రజలు, యువత కోరుకుంటున్నారని, అందుకు అందరం కృషి చేద్దామని  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహ అన్నారు. మెదక్ జిల్లా జోగిపేటలో  మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.

వచ్చే ఎన్నికల్లో  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియాగాంధీ రుణం తీర్చుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది రాజకీయ పార్టీలు కాదని ఉద్యోగ, విద్యార్థి, కళాకారులేనన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కాంగ్రెస్‌కే సాధ్యమని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement