కొనసాగుతున్న ఏడో దశ ఎన్నికల పోలింగ్ | 89 seats begin polling in seventh phase | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఏడో దశ ఎన్నికల పోలింగ్

Apr 30 2014 8:14 AM | Updated on Mar 9 2019 3:59 PM

కొనసాగుతున్న ఏడో దశ ఎన్నికల పోలింగ్ - Sakshi

కొనసాగుతున్న ఏడో దశ ఎన్నికల పోలింగ్

దేశవ్యాప్తంగా ఏడో దశ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రారంభమైంది.

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏడో దశ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. సుమారు 13.9 కోట్ల మంది ఓటర్లు దాదాపు 1,200 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో-14, పంజాబ్‌లో-13 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లో- 9, బీహార్‌- 7, జమ్మూకాశ్మీర్, దాద్రా నగర్ హవేలీ, దామన్ దయూలలో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరుగుతోంది.

ఇక తెలంగాణ ప్రాంతంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు 119 అసెంబ్లీ స్థానాలకు న్నికలు జరుగుతున్నాయి.  ఏడో దశ ఎన్నికల బరిలో వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ అగ్ర నేత ఎల్.కె. అద్వానీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, పలువురు కేంద్రమంత్రుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్దేశించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement