బెస్ట్‌ బిజినెస్‌ స్కూల్‌ ఐఐఎం అహ్మదాబాద్‌

IIM Ahmedabad Stands In First Place Among Business School In India - Sakshi

ఎఫ్‌టి ర్యాంకింగ్‌లో ఐఐఎం కలకత్తాకి తృతీయ స్థానం

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అహ్మదాబాద్‌ దేశంలోనే నంబర్‌ వన్‌ బిజినెస్‌ స్కూల్‌ గా స్థానం సంపాదించుకుంది. ఆ తరువాతి స్థానాల్లో ఐఐఎం కలకత్తా, ఐఐఎం బెంగుళూరు ఉన్నాయి. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ మాస్టర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ర్యాంకింగ్‌లో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం కలకత్తాలు ఆసియాలోనే ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ యేడాది సర్వేలో మొత్తం 104 బిజినెస్‌ స్కూల్స్‌ పాల్గొన్నాయి. గత యేడాది అంతర్జాతీయంగా 28వ స్థానంలో ఉన్న ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్స్‌ ఈ యేడాది  కొంత మెరుగై ఐఐఎం అహ్మదాబాద్‌ 21వ ర్యాంకులోనూ, ఐఐఎం కలకత్తా 23 ర్యాంకులోనూ నిలిచాయి.

ఎఫ్‌టి ర్యాంకింగ్‌ 2018 ఆసియాలోనే టాప్‌ టెన్‌ బిజినెస్‌ స్కూల్స్‌...
1. షాంఘై జియాఓ టాంగ్‌ యూనివర్సిటీ, ఆంటాయ్‌ – చైనా
2. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అహ్మదాబాద్‌ – ఇండియా
3. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ కలకత్తా – ఇండియా
4.స్కేమ బిజినెస్‌ స్కూల్‌ – చైనా
5. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ బెంగుళూరు – ఇండియా
6. టోంగ్జీ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ మనేజ్‌మెంట్‌ – చైనా
7. గ్రేనోబెల్‌ ఎకోల్‌ డి మేనేజ్‌మెంట్‌ – సింగపూర్‌
8. ఐక్యూఎస్‌–ఎఫ్‌జెయు–యుఎస్‌ఎఫ్‌ – తైవాన్‌
9. హల్ట్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ స్కూల్‌ – చైనా
10. సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ యూనివర్సిటీ, లీ కాంగ్‌ చైనా– సింగపూర్‌.

రెండు వేర్వేరు అధ్యయనాలను అనుసరించి బిజినెస్‌ స్కూల్స్‌కి ఈ ర్యాంకులు ఇచ్చారు. ఒకటి బిజినెస్‌ స్కూల్స్‌ నిర్వహించే అధ్యయనం అయితే, మరొకటి 2015లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన పూర్వ విద్యార్థుల అధ్యయనం ద్వారా కేటాయించే ర్యాంకులు. 2015 పూర్వ విద్యార్థుల సర్వే ప్రకారం వివిధ బిజినెస్‌ స్కూల్స్‌లో బోధించే సబ్జెక్టులఅనుసారం ఎకనామిక్స్‌ బోధనలో నంబర్‌ వన్‌ ర్యాంకునీ, ఫైనాన్స్‌ సబ్జెక్టు బోధనలో ఏడవ ర్యాంకునీ ఐఐఎం కలకత్తా కైవసం చేసుకుంది. టాప్‌ టెన్‌ బిజినెస్‌ స్కూల్స్‌లో బోధించే వివిధ సబ్జెక్టుల ఆధారంగా ఈ ర్యాంకులు ఇస్తారు.  

విద్యాబోధన, వసతులు, స్పోర్ట్స్‌ తదితర అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం వల్ల అత్యధిక మంది విదేశీ విద్యార్థులను ఈ యూనివర్సిటీలు ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల కోసం (సెమ్స్, ఐఎస్‌సిపి(యూరప్‌)తో సంయుక్తంగా నిర్వహిస్తోన్న డబుల్‌ డిగ్రీ కార్యక్రమాలు విద్యాప్రమాణాలు పెంచడానికి దోహదపడుతున్నాయి. దీంతో పాటు ప్రపంచప్రసిద్ధ యూనివర్సిటీలతో కలిసి చేస్తోన్న స్టూడెంట్స్‌ ఎక్సేంజ్‌ ప్రోగ్రాం కూడా ఈ విజయానికి కారణం. ప్రస్తుతం ఐఐఎం కలకత్తా మరో 100 బిజినెస్‌ స్కూల్స్‌తో కలిసి స్టుడెంట్‌ ఎక్చేంజ్‌ కార్యక్రమం ప్రతియేటా నిర్వహిస్తోంది. 2017–18లో ఐఐఎం కలకత్తా నుంచి 133 మంది విద్యార్థులు స్టూడెంట్‌ ఎక్చేంచ్‌ కార్యక్రమంలో భాగమయ్యారు. భాగస్వామ్య స్కూల్స్‌ నుంచి 87 మంది విద్యార్థులు ఐఐఎం కలకత్తా లో అధ్యయనం చేసినట్టు వెల్లడించారు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top