‘కాంతి స్వభావం- విద్యుదయస్కాంత వర్ణపటం’ అధ్యయనం?

‘కాంతి స్వభావం- విద్యుదయస్కాంత వర్ణపటం’ అధ్యయనం? - Sakshi


రసాయనశాస్త్రంలో పరమాణు నిర్మాణానికి సంబంధించి ‘కాంతి స్వభావం- విద్యుదయ స్కాంత వర్ణపటం’ పాఠ్యాంశాన్ని పోటీ పరీక్షల కోణంలో ఎలా అధ్యయనం చేయాలి?    

 - కె.సుప్రియ, మూసాపేట

 అన్ని పోటీ పరీక్షల్లో ‘కాంతి స్వభావం- విద్యుదయస్కాంత వర్ణపటం’ నుంచి ఎక్కువసార్లు ప్రశ్నలు వచ్చాయి. ముఖ్యంగా కాస్మిక్ కిరణాలు, గామా కిరణాలు,  గీ-కిరణాలు, ్ఖగ  కిరణాలు, దృగ్గోచర కిరణాలు, పరారుణ(ఐఆర్) కిరణాలు, మైక్రో తరంగాలు, రేడియో తరంగాల గురించి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఈ పాఠ్యాంశాన్ని అధ్యయనం చేయడం ఏంత తేలికో, అందులోని అంశాలను గుర్తుంచు కోవడం కూడా అంతే సులభం.

  ఉదాహరణకు ఒక గదిలో విద్యుత్ స్విచ్ వేస్తే మరో గదిలో విద్యుదయస్కాంత సిగ్నల్ ఆధారంగా పనిచేసే టీవీలో అలజడిని గమనించొచ్చు. అదేవిధంగా  అత్యధిక శక్తి(అల్ప తరంగదైర్ఘ్యం) ఉన్న గామా కిరణాలను క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి ఉపయోగిస్తే, అత్యధిక తరంగదైర్ఘ్యం(అల్పశక్తి) ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను సెల్‌ఫోన్లలో ఉపయోగిస్తారు. ఈ అంశాలన్నీ మన నిత్యజీవితంతో ముడిపడినవే కాబట్టి వీటి ధర్మాలు, ఉపయోగాలపై తరచుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు 2012 సివిల్స్ ప్రిలిమ్స్‌లో ‘నీటి శుద్ధి ప్రక్రియలో అతినీలలోహిత కిరణాల పాత్ర ఏమిటి? అనే ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం... ్ఖగ కాంతి నీటిలోని సూక్ష్మజీవులను అంతం చేస్తుంది. మురికిని అవక్షేపించడంలో, వాసనను తొలగించడంలో దీని పాత్ర ఉండదు. 2010లో ఓజోన్ పొర ఉపయోగం, రేడియో తరంగాల ధర్మానికి సంబంధించి కింది ప్రశ్న అడిగారు.

 ప్రశ్న: అయనోవరణమనే భూ వాతావరణంలోని ఒక పొర, రేడియో కమ్యూనికేషన్లకు వీలు కలిగిస్తుంది, ఎందువల్ల?

 సమాధానం: రేడియో తరంగాలకు సుదీర్ఘమైన తరంగదైర్ఘ్యం ఉంటుంది. ఓజోన్ పొర కాస్మిక్, ్ఖగ కిరణాలను మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. రేడియో తరంగాలకు అధిక తరంగదైర్ఘ్యం ఉండటం వల్ల సుదూర కమ్యూనికేషన్లకు ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా 2010లో  మైక్రోతరంగాలకు(మైక్రోవేవ్ ఓవెన్ పని చేసే సూత్రం) సంబంధించి  కింది విధంగా అడిగారు.

 ప్రశ్న: తెల్లని, ముద్రించని, స్వచ్ఛమైన పేపర్ ప్లేట్ మీద బంగాళదుంపను ఉంచి, దాన్ని మైక్రో ఓవెన్‌లో పెడితే బంగాళదుంప వేడెక్కుతుంది కానీ, పేపర్ ప్లేట్ వేడెక్కదు, కారణమేంటి?

 సమాధానం: ఆహార పదార్థంలోని నీటి అణువులు మైక్రోతరంగాలను గ్రహించి అత్యంత వేగంగా కంపనం చెందడం వల్ల జనించిన ఉష్ణం కారణంగా ఆహారం వేడెక్కుతుంది. కాబట్టి బంగాళదుంపల్లోని నీటికారణంగా అవి వేడెక్కుతాయి. పేపర్‌లో నీటి అణువులు లేకపోవడంతో అది వేడెక్కదు.  రాత్రివేళ చూడటానికి ఉపయోగించే పరికరాల్లో వాడే కిరణాలు ఏవి? అని 2009లో ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం పరారుణ తరంగాలు.

 పై ప్రశ్నలను గమనిస్తే విద్యుదయస్కాంత వర్ణపటంలోని వివిధ  వికిరణాల ధర్మాలు, ఉపయోగాలు, వాటిని ఉపయోగించి పనిచేసే వస్తువులు, ఆ వస్తువులు పని చేసే సూత్రాలు లాంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. కాబట్టి గామా, ఎక్స్, యూవీ, ఐఆర్, మైక్రో, రేడియో తరంగాల ధర్మాలకు సంబంధించిన మౌలిక సూత్రాలపై పట్టు సాధించాలి. దీనికోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో పాటు, సీఎస్‌ఐఆర్ ప్రచురించిన  How?  What? అనే పుస్తకాలు కూడా ఉపయుక్తంగా ఉంటాయి.

 

 ఇన్‌పుట్స్: డాక్టర్ బి.రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా

 

 జాబ్స్, అడ్మిషన్స్ అలర్‌‌ట్స

 శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ

 తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వివిధ పోస్టుల భర్తీకి డిజేబుల్డ్ పర్సన్స్ (మహిళలు) నుంచి దరఖాస్తులు కోరుతోంది.

 పోస్టుల వివరాలు: లైబ్రరీ అసిస్టెంట్  జూనియర్ అసిస్టెంట్  ఆఫీస్ సబార్డినేట్  హెల్పర్

  వాచ్‌మెన్   క్లీనర్

 దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: ఆగస్టు 11

 వెబ్‌సైట్: www.svuniversity.ac.in

 సర్దార్ వల్లభాయ్ పటేల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్స్

 పోస్ట్: స్టాఫ్ నర్స్

 ఖాళీలు: 111

 అర్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరిలో డిప్లొమా లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉండాలి. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి.

 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.

 దరఖాస్తులకు చివరి తేది: జూలై 30

 వెబ్‌సైట్: www.svppgip.org

 ఇండియన్ లా ఇన్‌స్టిట్యూట్-న్యూఢిల్లీ

 కోర్సులు: ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ది ఇంటర్నెట్ ఏజ్

  సైబర్ లాస్

 కాలపరిమితి: మూడు నెలలు

 అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా ఇంటర్ తర్వాత డిప్లొమా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఆగస్టు 18

 వెబ్‌సైట్: www.ili.ac.in

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top