హర్తాల్‌కు వైఎస్సార్‌ సీపీ మద్దతు | ysrcp support to harthal | Sakshi
Sakshi News home page

హర్తాల్‌కు వైఎస్సార్‌ సీపీ మద్దతు

Nov 26 2016 11:26 PM | Updated on Sep 4 2017 9:12 PM

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం ఈనెల 28వ తేదీ వామపక్షాలు తలపెట్టిన హర్తాల్‌కు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ జిల్లాలోని వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఇందులోపాల్గొనాలని పిలుపునిచ్చారు.

రాజంపేట టౌన్:  పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం  ఈనెల 28వ తేదీ వామపక్షాలు తలపెట్టిన హర్తాల్‌కు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పార్టీ  జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి తెలిపారు.   శనివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ  జిల్లాలోని వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఇందులోపాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్‌బీఐ అధికారులతో మాట్లాడానని, రాష్ట్రానికి వేలకోట్లు వచ్చేస్తున్నాయని ప్రకటనలు ఇస్తున్నారన్నారు. ఈ క్లిష్ట తరుణంలో కూడా బాబు  ప్రజలను మోసగించడం  దారుణమన్నారు. దాదాపు 18 రోజులుగా ప్రజలు నగదు లభించక కష్టాలు పడుతున్నారని, వీటిని తొలగించేందుకు చంద్రబాబు  ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆకేపాటి డిమాండ్‌ చేశారు. హర్తాల్‌ శాంతియుతంగా చేపట్టే కార్యక్రమమని, ప్రతిఒక్కరూ  గాంధేయ మార్గాన  కష్టాలను ప్రభుత్వాలకు తెలపాలని ఆకేపాటి కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement