breaking news
rbi officers
-
రిజర్వ్ బ్యాంకు ఆఫీసర్ల జీతాలు ఎంతుంటాయో తెలుసా?
దేశంలోని బ్యాంకులన్నింటికీ బాసు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అదేనండి ఆర్బీఐ. సాధారణంగానే బ్యాంకు ఉద్యోగుల జీతాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. మరి దేశ అత్యున్నత బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంకులో ఆఫీసర్ల జీతాలు ఎంతుంటాయన్నది మరింత ఆసక్తికరం. ఎంట్రీ లెవల్ గ్రేడ్ బి ఆఫీసర్ల నుంచి ఉన్నత స్థాయి డిప్యూటీ జనరల్ మేనేజర్ల వరకు జీతాలు ఏ స్థాయిలో ఉంటాయన్నది ఈ కథనంలో తెలుసుకుందామా?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే గ్రేడ్ బి ఆఫీసర్ల వేతన స్కేలును అధికారికంగా సవరించింది. 2025 నోటిఫికేషన్ ప్రకారం, ప్రారంభ ప్రాథమిక వేతనం నెలకు రూ .55,200 నుండి రూ .78,450 కు పెంచింది. స్థూల నెలవారీ వేతనం ఇప్పుడు రూ .1,50,374 కు చేరుకుంది.గ్రేడ్ బి ఆఫీసర్ సవరించిన నెలవారీ జీతం బ్రేక్‌డౌన్ ఇలా..బేసిక్ వేతనం: రూ.78,450స్థూల వేతనం: రూ.1,50,374 (హెచ్ఆర్ఏ మినహాయించి)ఇన్-హ్యాండ్ పే: రూ.1.2 లక్షల - రూ.1.35 లక్షలు (లొకేషన్,మినహాయింపులను బట్టి)పే స్కేల్: 16 ఏళ్లలో రూ.78,450 - రూ.1,41,600వేతనానికి మించిన ప్రోత్సాహకాలుఆర్బీఐ అధికారులు హౌసింగ్ అలవెన్సులు (మెట్రోలలో నెలకు రూ .70,000 వరకు), అభ్యాస రీయింబర్స్మెంట్లు, భోజన రాయితీలు, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్) కింద ఉదారమైన పెన్షన్ మొత్తాలను పొందుతారు.ఆఫీసర్ హోదానెల జీతంఅసిస్టెంట్ జనరల్ మేనేజర్రూ.2.44 లక్షలు – రూ.4.33 లక్షలుజనరల్ మేనేజర్రూ.2.91 లక్షలు – రూ.4.58 లక్షలుడిపార్ట్ మెంట్ మేనేజర్రూ.2.08 లక్షలు – రూ.3.33 లక్షలుడిప్యూటీ మేనేజర్రూ.1.5 లక్షలు – రూ.2.5 లక్షలుడిస్ట్రిక్ట్ మేనేజర్రూ.1.08 లక్షలు – రూ.2 లక్షలుఆఫీస్ అసిస్టెంట్రూ.43,000 – రూ.1.01 లక్షలుఆఫీస్ అటెండెంట్రూ.27,500 – రూ.66,600గమనిక: ఇక్కడ పేర్కొన్న జీతం గణాంకాలు ఆంబిషన్ బాక్స్, గ్లాస్ డోర్ వంటి థర్డ్ పార్టీ వేదికల్లో నమోదుల ఆధారంగా ఉజ్జాయింపుగా రూపొందించినవి. -
అమెరికా నర్సునంటూ తీయని మాటలు
జయనగర: అమెరికాలో నర్సు, ఆర్బీఐ ఆఫీసర్, కస్టమ్స్ అధికారి తదితర పేర్లతో ఒక మాయలేడి నగరానికి చెందిన టెక్కీకి తీయని మాటలు చెప్పి దఫదఫాలుగా రూ.9.02 లక్షల నగదును తన అకౌంట్‌కు జమచేసుకుని మోసగించిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. అశోకనగర పోలీసుల కథనం ప్రకారం....నెలమంగలకు చెందిన రమేశ్ అనే వ్యక్తి నగరంలో ఓ ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో టెక్కీ. ఇతడికి ఫేస్ బుక్‌లో రచనా కరం అనే యువతి పరిచయమైంది. ఇద్దరూ మొబైల్ నెంబర్లు మార్చుకుని కబుర్లు చెప్పుకోవడం ఆరంభించారు. బెంగళూరుకు వస్తానని.. తాను అమెరికాలో నర్సుగా పనిచేస్తున్నట్లు, త్వరలో బెంగళూరుకు వస్తానని, పర్యాటక ప్రాంతాలను వీక్షించడానికి తాను బసచేయడానికి ఇంటిని చూడాలని రమేశ్‌కు తెలిపింది. ప్రస్తుతానికి తన వద్ద డబ్బులేదని రమేశ్ ఆమెతో చెప్పాడు. అమెరికా డాలర్లు, బంగారు ఆభరణాలు పార్శిల్ ద్వారా పంపిస్తానని, డాలర్లను రూపాయిల్లోకి మార్చుకోవాలని రచనా కరం అతణ్ని బుట్టలోకి వేసింది. ఇది నమ్మిన రమేశ్ కొన్నిరోజులకు ఆమె చెప్పిన బ్యాంకు ఖాతాలోకి రూ.4లక్షల 70 వేల నగదు జమచేశాడు. అనంతరం అక్టోబరు 2వ తేదీన ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారి నిషా కుమారి పేరుతో రమేశ్‌కు ఫోన్ వచ్చింది. అమెరికా నుంచి పార్శిల్ వచ్చిందని, కస్టమ్స్ సుంకాన్ని విమానాశ్రయ అధికారి సుమన్‌దేవి ఖాతాకు జమ చేస్తే, పార్శిల్‌ను మీకు పంపిస్తానని చెప్పింది. ఈమె మాటలు నమ్మిన రమేశ్ అక్టోబరు 3వ తేదీన నిషా కుమారి ఖాతా కు రూ.1.62 లక్షల నగదు పంపారు. పార్శిల్ బరువు ఎక్కువగా, పన్నులు కట్టాలని రమేష్‌కు మళ్లీ నిషాకుమారి ఫోన్ చేసింది, మాన్సింగ్ ఖరే అనే అధికారి అకౌంట్‌కు రూ.2.70 లక్షల నగదు జమచేయాలని సూచించింది. ఈమె మాటలు నమ్మిన రమేశ్ ఆమె చెప్పిన ఖాతాలోకి ఆ సొమ్మును జమచేశాడు. మరో రూ.4.70 లక్షలు పంపాలని ఫోన్ చివరికి అక్టోబరు 25 తేదీన ఆర్బీఐ ప్రధానాధాకిరాఇ స్వరబ్ జోషిననే పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి అమెరికా పార్శిల్ కోసం మీరు పంపిన డబ్బు ఆ అకౌంట్లలోకి జమ కాలేదని, మళ్లీ రూ.4.70 లక్షల నగదు అకౌంట్‌కు జమచేయాలని తెలిపాడు. దీంతో అప్పటికే నగదు పంపీ పంపీ విసిగిపోయిన రమేశ్‌కు అనుమానం వచ్చి ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లి విచారించగా, ఇదంతా ఫ్రాడ్, ఎవరో నిన్ను తెలివిగా మోసగించారని వారు స్పష్టంచేశారు. బాధితుడు రమేశ్ లబోదిబోమంటూ శనివారం అశోకనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ క్రైం పోలీసుల సహాయంతో వంచకురాలి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
96 శాతం రూ.2వేల నోట్లే: ఈటల
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిన కొత్త కరెన్సీలో 96 శాతం రూ.2000 నోట్లేనని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌చంద్రతో కలిసి ఆర్బీఐ అధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఆర్బీఐ నుంచి ఇప్పటి వరకు రూ.17,500 కోట్లు వచ్చాయని, లెక్క ప్రకారం రూ.20 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి ఐదువేల కోట్ల చిన్న నోట్లు ఇస్తేనే ప్రస్తుత ఇబ్బందుల నుంచి గట్టెక్కుతామన్నారు. పేదలు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కొంతమంది దగ్గర వేల కోట్ల కొత్త నోట్లు దొరుకుతుండడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను కొంతమంది కమీషన్ల పేరుతో మోసం చేస్తున్నారన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. క్యాష్‌లెస్ విధానానికి తెలంగాణ ప్రభుత్వ పూర్తి మద్దతు ఉంటుందంటూ ఆర్బీఐ, కేంద్రం తమకు సహకరించాలని ఈటల కోరారు. -
హర్తాల్‌కు వైఎస్సార్ సీపీ మద్దతు
రాజంపేట టౌన్: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం ఈనెల 28వ తేదీ వామపక్షాలు తలపెట్టిన హర్తాల్‌కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ జిల్లాలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఇందులోపాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్బీఐ అధికారులతో మాట్లాడానని, రాష్ట్రానికి వేలకోట్లు వచ్చేస్తున్నాయని ప్రకటనలు ఇస్తున్నారన్నారు. ఈ క్లిష్ట తరుణంలో కూడా బాబు ప్రజలను మోసగించడం దారుణమన్నారు. దాదాపు 18 రోజులుగా ప్రజలు నగదు లభించక కష్టాలు పడుతున్నారని, వీటిని తొలగించేందుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆకేపాటి డిమాండ్ చేశారు. హర్తాల్ శాంతియుతంగా చేపట్టే కార్యక్రమమని, ప్రతిఒక్కరూ గాంధేయ మార్గాన కష్టాలను ప్రభుత్వాలకు తెలపాలని ఆకేపాటి కోరారు.