చంద్రబాబుపై ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజం | ysrcp mla kodali nani fire on ap cm chandra babu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజం

May 18 2016 7:26 AM | Updated on Aug 15 2018 9:30 PM

చంద్రబాబుపై ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజం - Sakshi

చంద్రబాబుపై ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజం

రాష్ట్రానికి చుక్కనీరు రాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని..

దమ్ముంటే తెగదెంపులు చేసుకో..  
లేదంటే బీజేపీలో విలీనం చెయ్..

గుడివాడ: రాష్ట్రానికి చుక్కనీరు రాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని.. కేంద్రం నుంచి పైసా నిధులు తీసుకురాలేని సీఎం అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్షకు మద్దతుగా మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కేంద్రంలో అధికారం పంచుకుంటూ.. కేంద్రం నుంచి పైసా నిధులు తీసుకురాలేదని విమర్శించారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను కాపాడాలంటే టీడీపీని బీజేపీలో విలీనం చేసి కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని, లేదంటే బీజేపీతో తెగదెంపులు చేసుకుని ప్రాజెక్టులు ఆపేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పోరాటం చేయాలని ఆయన హితవు పలికారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న దీక్షను రాజకీయంగా అభివర్ణించటం సరికాదన్నారు. చంద్రబాబు రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్‌తో చెలగాటమాడొద్దని హితవు పలికారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తే మన రాష్ట్రం భవిష్యత్ ఎడారిగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మండలి హనుమంతరావు, దుక్కిపాటి శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement