ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయడం లేదని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.
విజయనగరం: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయడం లేదని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. దాచుకోవడం దోచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతోందని ఆయన శుక్రవారమిక్కడ మండిపడ్డారు.
పార్టీ నేత ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ...ఎన్నికలకు ముందు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ... నేడు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. రైతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేత బొత్స సత్యనారాయణతో కలిసి త్వరలో విజయనగరంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.