విశాఖ రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
విశాఖపట్నం : విశాఖ రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. లేకుంటే ఏప్రిల్ 14వ తేదీన నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం విశాఖలోని ఎన్ఏడీ కొత్తరోడ్డులో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, మళ్ల విజయప్రసాద్, ధర్మాన కృష్ణదాసు, కర్రి సీతారం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నైతిక విలువలు కోల్పోయారని ఆరోపించారు. అసెంబ్లీని బర్తరఫ్ చేసి మళ్లీ ప్రజల్లోకి వచ్చి గెలవాలని డిమాండ్ చేశారు.