వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన షెడ్యూల్ | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన షెడ్యూల్

Published Wed, Dec 23 2015 8:39 PM

వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన షెడ్యూల్ - Sakshi

వైఎస్సార్ జిల్లా: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటలో భాగంగా ఈ నెల 24 నుంచి 27 వరకు ఆయన వైఎస్ఆర్ జిల్లా ఇడుపలపాయలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి...

నాలుగు రోజుల పర్యటన షెడ్యూల్...
తొలి రోజు పర్యటన (డిసెంబర్ 24, 2015)
డిసెంబర్ 24 న ఉదయం 7.30 లకు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు ఆర్పిస్తారు.  
ఉదయం 9 గంటలకు ప్రార్థన సమావేశాల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు.
మధ్యాహ్నం 12.30 లకు ప్రొద్దుటూర్లోని ఎఫ్జీ ఫంక్షన్ హాల్లో పులివెందుల కౌన్సిలర్ కోళ్ల భాస్కర్ కూతురి వివాహానికి హాజరవుతారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రొద్దుటూర్లో కొవ్వూరు రామసుబ్బారెడ్డి కల్యాణమండపంలో జరిగే వినోద్ కుమార్ రెడ్డి మ్యారెజ్ రిసెప్షన్ కు హాజరవుతారు.
సాయంత్రం 4 గంటలకు కొండారెడ్డిపల్లికి చేరుకుని అక్కడి సర్పంచ్ శివ ప్రసాద్ రెడ్డి కుమారుడు నారాయణ రెడ్డిని వైఎస్ జగన్ అశ్వీరదీస్తారు.

రెండో రోజు పర్యటన (డిసెంబర్ 25, 2015)
ఉదయం 8.30 గంటలకు పులివెందుల చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు
ఉదయం 11 గంటలకు పులివెందులలోని ఆయన నివాసానికి చేరుకుంటారు
సాయంత్రం 5.30  లకు పులివెందులలోని అంకాలమ్మ గుడి సమీపంలో ఉన్న దివంగత జయ లక్ష్మి టీచర్ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.
  సాయంత్రం 6 గంటలకు పులివెందులలోని అంకాలమ్మ గుడి వద్ద పీరవళ్లి (తండ్రి గంట మస్తానాయ్య) కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

మూడో రోజు పర్యటన (డిసెంబర్ 26, 2015)
ఉదయం 8.30 గంటలకు పులివెందులలోని పాల్ రెడ్డి ఫంక్షన్ హాల్లో పెండ్లూరి ఈశ్వరరెడ్డి కుమారుడు మహేశ్వరరెడ్డి వివాహానికి
హాజరవుతారు.
ఉదయం 9 గంటలకు తొందూరు శివాలయంలో జరిగే గంగరాజు వివాహానికి హాజరవుతారు.
ఉదయం 10 గంలకు భద్రంపల్లికి చేరుకుని అక్కడి అరుణ్కాంత్ రెడ్డి, రామ్ మెహన్ రెడ్డి, చిన్న కేశవరెడ్డి కుటుంబాలను పరామర్శిస్తారు.
ఉదయం 11 గంలకు లింగాల మండలంలోని అంకెవానిపల్లిలో శ్రీ వీరా చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు
మధ్యాహ్నం 12 గంలకు పులివెందులలోని తన నివాసంలో వైఎస్ జగన్ భోజనం చేస్తారు.
మధ్యాహ్నం 2 గంలకు చక్రాయపేట మండలం మారెళ్ల మాదాకలో ఇటీవల పెళ్లిచేసుకున్న రామాంజనేయ రెడ్డి నివాసానికి వెళ్లి అభినందిస్తారు.
  మధ్నాహ్నం 3 గంలకు సిద్ధారెడ్డిపల్లిలో చక్రాయపేట మండలంలో మాజీ ఎంపీటీసీ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి ఇటీవల పెళ్లైన ఆయన కుమారుడు బయా రెడ్డిని అభినందిస్తారు. అనంతరం దివంగత లక్ష్మి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను, దివంగత రైతు శ్రీ మోహన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.

నాల్గో రోజు పర్యటన (డిసెంబర్ 27, 2015)
ఉదయం 9 గంటలకు వెంపల్లిలో జెడ్పీటీసీ షబ్బీర్ వివాహానికి హాజరవుతారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement