
కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలపండి...
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలిపిందుకు ముందడుగు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
వరంగల్ : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలిపేందుకు ముందడుగు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్టేషన్ ఘన్పూర్ ఎన్నికల ప్రచార సభలో గురువారం ఆయన మాట్లాడుతూ....వరంగల్ ఉప ఎన్నిక ఎందుకు తీసుకు వచ్చారో కేసీఆర్‌ను ప్రజలు నిలదీయాలన్నారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే 150 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రైతుల ఆత్మహత్యలకు కారణమెవరో నిలదీయాలన్నారు.
లక్ష లోపు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారని, అయితే ఇంతవరకూ ఎన్ని రుణాలను మాఫీ చేశారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక నాలుగు దఫాలుగా రుణ మాఫీ చేస్తామంటున్నారని, ఇవాళ రైతుల మీద 14 శాతం అపరాధ వడ్డీ పడుతోంది. విడతల వారీగా కేసీఆర్ ఇచ్చే మొత్తంలో మూడొంతులు వడ్డీకే పోతోంది. ఇంకో వైపు రుణాలు రెన్యూవల్ కాకపోవడంతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందక రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన అన్నారు. ఇక నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని, సామాన్య ప్రజలు ఏం కొనేటట్లు లేదని వైఎస్ జగన్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే....
*వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో పత్తి క్వింటాల్కు రు.6,700 పలికింది.
*ఇప్పుడు రూ.3 వేలు కూడా పలకడం లేదు.
* రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి, ఇప్పుడు 4 విడతల్లో మాఫీ చేస్తామంటున్నారు.
* ఏడాది క్రితం కందిపప్పు రూ.90 ఉంటే... ఇప్పుడు రూ.230 అయింది.
* పెసరపప్పు రూ.85 నుంచి రు.200 అయింది.
*టమాటాలు కేజీ రూ.14 నుంచి రూ.45 అయింది.
* 18 నెలల్లో ఎన్ని ఇళ్లు కట్టించారో కేసీఆర్‌ను అడగండి.
* వైఎస్ఆర్ ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు.
* కేసీఆర్ ఇప్పటివరకూ 394 ఇళ్లు మాత్రమే కట్టించారు.
* ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు.
* ఇప్పటివరకూ ఎంతమందికి ఇచ్చారో కేసీఆర్‌ను అడగండి.
* కేసీఆర్ కేవలం 1600 ఎకరాలు ఇచ్చి చేతలు దులపుకున్నారు.
*వైఎస్ఆర్ పేదలకు 20 లక్షల 66 ఎకరాల భూమి పంపిణీ చేశారు.
* పేదలు పెద్ద చదువులు చదవాలని వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు?
*కానీ కేసీఆర్ సర్కార్ గతేడాది బకాయిలే రూ.1530 కోట్లు చెల్లించలేదు.
*పేదవారి వైద్య సేవల కోసం 108 వైఎస్ఆర్ ప్రవేశపెట్టారు.
*వైఎస్ఆర్ కొన్న అంబులెన్స్‌లు తప్ప... ఈ ప్రభుత్వం ఒక్క కొత్త అంబులెన్స్ కొనలేదు.
*ఈ పాలకులకు బుద్ధి రావాలంటే రాజన్న రాజ్యం రావాలి.
* కాంగ్రెస్ అంత అన్యాయమైన పార్టీ ఎక్కడా ఉండదు
* ప్రాణాలు లెక్కచేయక వైఎస్ఆర్ ...కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే
జగన్ పార్టీ విడిచిపెట్టాక వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ జైలుకు పంపింది.
* కాంగ్రెస్ పార్టీకి విలువలు, విశ్వసనీయత లేదు.
* చంద్రబాబు పాలన అంతా అబద్ధాలు, మోసం, వెన్నుపోటు.
* అధికారంలోకి వచ్చి 18 నెలులు అయినా, కేంద్రంలోని బీజేపీ సర్కార్
ఒక్క హామీ నెరవేర్చలేదు.
*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉంది.
*వైఎస్ఆర్ ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి మేలు చేశారు.
*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు ఓటు వేసి గెలిపించండి.
*ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది.