యాదయ్యకు పీహెచ్‌డీ పట్టా | yadaiah taken phd graduated | Sakshi
Sakshi News home page

యాదయ్యకు పీహెచ్‌డీ పట్టా

Sep 20 2016 8:38 PM | Updated on Sep 4 2017 2:16 PM

యాదయ్యకు పీహెచ్‌డీ పట్టా

యాదయ్యకు పీహెచ్‌డీ పట్టా

గుర్రంపోడు : మండలంలోని మొసంగికి చెందిన నిర్శనమెట్ల యాదయ్యకు ఐఐటీ గౌహతి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

గుర్రంపోడు :  మండలంలోని మొసంగికి చెందిన నిర్శనమెట్ల యాదయ్యకు ఐఐటీ గౌహతి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ లేబర్‌ బేసెడ్‌ మాన్యుపాక్చరింగ్‌ అనే అంశంపై చేసిన పరిశోధనకుగాను పీహెచ్‌yీ  పొందాడు. దళిత కుటుంబానికి చెందిన యాదయ్య ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థిగానే ఉంటూ ఎంతో కష్టపడి డాక్టరేట్‌ కావడం తనకు ఎంతో సంతోషాన్ని కల్గించిదని యాదయ్య అన్నారు. గేట్‌ ద్వారా ఐఐటీ గౌహతి విశ్వవిద్యాలయంలో సీటు సాధించినట్లు తెలిపారు. అంబేద్కర్‌ ఆశయ సాధనకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడతానని తెలిపారు. బస్సు సౌకర్యం కూడ లేని మారుమూల గ్రామానికి చెందిన యాదయ్యకు పీహెచ్‌డీ రావడం తమ గ్రామానికి గర్వకారణమని మండల టీఆర్‌ఎస్‌ నాయకుడు నిర్శనమెట్ల అశోక్‌ అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement