మరువవంక పూడికతీత పనులు ప్రారంభం | works start in maruva vanka | Sakshi
Sakshi News home page

మరువవంక పూడికతీత పనులు ప్రారంభం

Nov 2 2016 11:16 PM | Updated on Sep 4 2017 6:59 PM

మరువవంక పూడికతీత పనులు ప్రారంభం

మరువవంక పూడికతీత పనులు ప్రారంభం

ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి పర్యవేక్షణలో మరువవంక పూడికతీత పనులు బుధవారం ప్రారంభమయ్యాయి.

అనంతపురం న్యూసిటీ : ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి పర్యవేక్షణలో మరువవంక పూడికతీత పనులు బుధవారం ప్రారంభమయ్యాయి.  నగరంలోని మరువకొమ్మ కాలనీ, సంగమేశ్వర థియేటర్ తదితర ప్రాంతాల్లో  12 ఇటాచీలతో పూడికను తొలగించారు. నగరపాలక సంస్థ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌ శాఖల నుంచి అధికారులను తీసుకువచ్చి వారి సూచనలతో పనులు చేయించారు.

పాలకులు పట్టించుకోవడం లేదు
పారిశుద్ధ్యం మెరుగుకు పాలకులు పట్టించుకోవడం లేదని, అందుకే పూడికతీత పనులు తానే స్వయంగా చేయించాల్సి వచ్చిందని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.  మరువవంకకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రణాళికలు పంపామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement