మృతి చెందగా మహిళను మత్స్యకారులు ప్రాణాలతో కాపాడారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో ధవళేశ్వరం రామపాదాల రేవునకు ఎగువన ఇద్దరు పిల్లలను చీరకు చుట్టుకున్న విజయలక్ష్మి అనే మహిళ గోదావరిలోకి దూకేసింది. రామపాదాల రేవు వైపునకు కొట్టుకు వస్తున్న వారిని స్థానిక మత్స్యకారులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. ఆమెను పట్టుకొ
ఇద్దరు పిల్లలతో గోదావరిలో దూకిన మహిళ
Jul 27 2016 1:03 AM | Updated on Sep 4 2017 6:24 AM
∙పిల్లలు మృతి ∙
తల్లిని రక్షించిన మత్స్యకారులు
ధవళేశ్వరం : ఇద్దరు పిల్లలతో గోదావరి నదిలోకి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలూ మృతి చెందగా మహిళను మత్స్యకారులు ప్రాణాలతో కాపాడారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో ధవళేశ్వరం రామపాదాల రేవునకు ఎగువన ఇద్దరు పిల్లలను చీరకు చుట్టుకున్న విజయలక్ష్మి అనే మహిళ గోదావరిలోకి దూకేసింది. రామపాదాల రేవు వైపునకు కొట్టుకు వస్తున్న వారిని స్థానిక మత్స్యకారులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. ఆమెను పట్టుకొని ఉన్న కుమారుడు చంద్రవాచార్యులు (4), కుమార్తె శ్రీనిధి (3) అప్పటికే మృతి చెందారని స్థానికులు తెలి పారు. ప్రాణాలతో బయటపడిన విజయలక్ష్మి వేమగిరి కోకోకోలా కంపెనీ ఉద్యోగి సుబ్రహ్మణ్యాచార్యులు భార్య. చిన్నారుల మృతదేహాలను బం ధువులు తీసుకువెళ్లినట్టు వారు చెప్పారు. వారు గోదావరిలో దూకే ముందు ఫోన్ మాట్లాడారని ఆ వెంటనే గోదావరిలో దూకినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చిన్నారులను పొట్టనపెట్టుకున్నావంటూ బంధువులు విజయలక్ష్మిని కొట్టి అక్కడ నుంచి తీసుకు Ðð ళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఆమె ప్రస్తుతం ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని ధవళేశ్వరం పోలీసులు పేర్కొన్నారు. గ్రామంలో మంగళవారం రాత్రి సంచల నం రేపిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement