డెంగీతో మహిళ మృతి | women died with dengy | Sakshi
Sakshi News home page

డెంగీతో మహిళ మృతి

Aug 27 2016 11:16 PM | Updated on Sep 4 2017 11:10 AM

మండలంలోని ముండ్ల గ్రామానికి చెందిన కుమారి ప్రధానో(47) శనివారం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మొదట ఆమెకు రక్త పరీక్షలు చేసిన తర్వాత డెంగీ ఫీవర్‌గా నిర్ధారించిన తర్వాత బరంపురంలోని ఎంకేసీజీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు.

కంచిలి : మండలంలోని ముండ్ల గ్రామానికి చెందిన కుమారి ప్రధానో(47) శనివారం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మొదట ఆమెకు రక్త పరీక్షలు చేసిన తర్వాత డెంగీ ఫీవర్‌గా నిర్ధారించిన తర్వాత బరంపురంలోని ఎంకేసీజీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్సకు విశాఖపట్నం తరలించగా ప్లేట్‌లెట్ల కౌంట్‌(రక్తఫలకికలు)సంఖ్య 11,000కు పడిపోవడంతో ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. ఆమె మరణంతో కుటుం సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. డెంగీ మరణంతో ముండ్ల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement