కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య | women committed to suviside | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

Sep 11 2016 9:58 PM | Updated on Sep 4 2017 1:06 PM

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాల నేపధ్యంలో ఓ వివాహిత ఆత్యహత్య చేసుకున్న ఘటన మండలంలోని కోనాయిపాలెంలో జరిగింది. సేకరించిన సమాచారం మేరకు నందిగామ పట్టణం చక్రాల బజార్‌కు చెందిన అల్లి లక్ష్మి(35) ఆదివారం మధ్యాహ్నం సమయంలో కోనాయిపాలెం గ్రామంలోని చెరువులోకి దిగి ఆత్మహత్య చేసుకుంది.

 
చందర్లపాడు :
 కుటుంబ కలహాల నేపధ్యంలో ఓ వివాహిత ఆత్యహత్య చేసుకున్న ఘటన మండలంలోని కోనాయిపాలెంలో జరిగింది. సేకరించిన సమాచారం మేరకు నందిగామ పట్టణం  చక్రాల బజార్‌కు చెందిన అల్లి లక్ష్మి(35) ఆదివారం మధ్యాహ్నం సమయంలో కోనాయిపాలెం గ్రామంలోని చెరువులోకి దిగి ఆత్మహత్య చేసుకుంది. విషయం గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. చెరువులో నీటిలోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ నూతలపాటి నాగేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement