వివాహిత ఆత్మహత్య | woman suicides in janthulur | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Sep 10 2016 12:16 AM | Updated on Sep 4 2017 12:49 PM

మండల పరిధిలోని జంతులూరులో ఓ వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.

బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని జంతులూరులో ఓ వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు జంతులూరు గ్రామానికి చెందిన యంగప్ప, నారాయణమ్మల కుమార్తె వసుంధర (22) ముదిగుబ్బ మండలం పాల్యం గ్రామానికి చెందిన హరికి ఇచ్చి ఆరునెలల క్రితం పెళ్లి చేశారు. అయితే వసుంధరకు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది.

ఇందులో భాగంగానే తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. శుక్రవారం కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement