మండలంలోని గూనిపల్లిలో ఓ వివాహిత కడుపునొప్పి తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
బుక్కపట్నం : మండలంలోని గూనిపల్లిలో ఓ వివాహిత కడుపునొప్పి తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు.. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి భార్య ఊహ(24) తరచూ కడుపునొప్పితో బాధపడుతుండేది. అయితే సోమవారం నొప్పి అధికం కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడి ఉంది.
స్కూల్ నుంచి వచ్చిన వారి పిల్లలు గమనించి చుట్టుపక్కల వారికి చెప్పగా వారు బాధితురాలిని బత్తలపల్లి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఊహ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యతీంద్ర తెలిపారు. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.