Srikanth Divorce Rumours: విడాకుల పుకార్లను తీవ్రంగా ఖండించిన శ్రీకాంత్ 

Actor Srikanth Denied His Divorce Rumours With Wife Uha - Sakshi

సీనియర్‌ హీరో, నటుడు శ్రీకాంత్‌- ఊహ విడాకులు తీసుకుంటున్నారనే రూమర్స్‌ కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన విడాకుల వార్తలపై హీరో శ్రీకాంత్‌ స్పందించారు. తాను-ఊహా విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. కొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌ వారి గుంరించిన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వటం పట్ల హీరో శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు ఆయన ప్రెస్‌నోట్‌ విడదుల చేశారు.  ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను? అని ప్రశ్నించారు.

‘‘గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా  విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్సైట్స్‌లో వచ్చిన  ఈ ఫేక్ న్యూస్‌ను నా ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. దీంతో నేను ‘ఇలాంటివి ఏమాత్రం నమ్మోద్దు. ఆందోళన పడోద్దు’ అని తనను ఓదార్చాను . అయితే ఏవో కొన్ని చిల్లర వెబ్సైట్స్, యూట్యూబ్ చానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవ్వతున్నాయి.

దీంతో మా బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ  ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్‌గా అనిపిస్తుంది . ప్రస్తుతం నేనూ  ఊహ నిన్న చెన్నై వచ్చి ఇక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి తరుణంలో ఈ పుకారు మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇది ఇంకా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం  ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. నా మీదనే కాకుండా  చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’’ అని శ్రీకాంత్‌ తన లేఖలో పేర్కొన్నారు. 

చదవండి: 
బిజినెస్‌ విమెన్‌తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా?
ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్‌మెంట్స్‌ చూస్తే షాకవ్వాల్సిందే

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top