కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య | woman suicides in chinnampalli | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య

May 11 2017 10:38 PM | Updated on Nov 6 2018 7:53 PM

కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

శెట్టూరు : కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల మేరకు..శెట్టూరు మండలంలోని చిన్నంపల్లి గ్రామానికి చెందిన వడ్డే అక్కమ్మ(34)కు అదే గ్రామానికి చెందిన నరసింహులుతో వివాహం జరిగింది. ఆరు నెలలుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతుండేది.  గురువారం తెల్లవారుజామున ఇంటి దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఎంత సేపటికి తలుపులు తెరవకపోవడంతో, అనుమానం వచ్చిన బంధువులు తలుపులు పగులగొట్టి చూడక అక్కమ్మ ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఆమెకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్‌ఐ శ్రీకాంత్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement