వివాహిత ఆత్మహత్య | woman suicides | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Feb 16 2017 10:31 PM | Updated on Sep 5 2017 3:53 AM

మండల పరిధిలోని ఉదిరిపికొండ తండాలో గురువారం వేకువ జామున వెంకటమ్మ(60) అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కూడేరు : మండల పరిధిలోని ఉదిరిపికొండ తండాలో గురువారం వేకువ జామున వెంకటమ్మ(60) అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హెడ్‌ కానిస్టేబుల్‌ దస్తగిరి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంకటమ్మకు భర్త రామన్న, కుమారుడు పెన్నోబులేసు , ముగ్గురు కుమార్తెలున్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. అయితే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన వెంకటమ్మ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిపైకప్పుకు తాడుతో ఉరివేసుకుంది. కాసేపటికి ఆమె కోడలు ఇంటికి వచ్చి చూడగా అప్పటికే తాడుకు వేలాడుతూ కన్పించింది. కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement