breaking news
udiripikonda
-
వడదెబ్బతో ఒకరి మృతి
కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం ఉదిరిపికొండలో బోయ నాగన్న కుమారుడు రాజప్ప(38) వడదెబ్బకు గురై బుధవారం మరణించినట్లు బంధువులు తెలిపారు. కూలి పనులకు వెళ్లిన ఆయన ఎండలో ఎక్కువ సేపు పని చేయడంతో సాయంత్రం ఇంటికి రాగానే సొమ్మసిల్లిపడిపోయాడన్నారు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని అనంతపురం పెద్దాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. -
వివాహిత ఆత్మహత్య
కూడేరు : మండల పరిధిలోని ఉదిరిపికొండ తండాలో గురువారం వేకువ జామున వెంకటమ్మ(60) అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ దస్తగిరి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంకటమ్మకు భర్త రామన్న, కుమారుడు పెన్నోబులేసు , ముగ్గురు కుమార్తెలున్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. అయితే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన వెంకటమ్మ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిపైకప్పుకు తాడుతో ఉరివేసుకుంది. కాసేపటికి ఆమె కోడలు ఇంటికి వచ్చి చూడగా అప్పటికే తాడుకు వేలాడుతూ కన్పించింది. కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.