ట్రాఫిక్‌ సమస్య లేకుండా చర్యలు | Without traffic measures | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ సమస్య లేకుండా చర్యలు

Jan 12 2017 1:53 AM | Updated on Aug 29 2018 4:18 PM

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ట్రాఫిక్‌ రద్దీ, ప్రమాదాలు జరిగే ప్రాంతాలతోపాటు

నల్లగొండ క్రైం : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ట్రాఫిక్‌ రద్దీ, ప్రమాదాలు జరిగే ప్రాంతాలతోపాటు ప్రకాశం బజారులోని కూరగాయల మార్కెట్‌ను  బుధవారం జేసీ నారాయణరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో ప్రీ లెఫ్ట్‌ డైవర్షన్‌ మార్గాలు ఏర్పాటు చేసి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు. క్లాక్‌టవర్‌ వద్ద కూరగాయల విక్రయాలతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడిందన్నారు. వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ప్రకాశం బజారులోని కూరగాయల మార్కెట్‌కు మార్చనున్నట్లు వెల్లడించారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు మళ్లింపు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు విధిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణకు మున్సిపల్, జెడ్పీ, ఆర్‌అండ్‌బీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ నారాయణరెడ్డి సూచించారు. డీఎస్పీ సుధాకర్, ట్రాఫిక్‌ సీఐ ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement