భర్త వియోగంతో భార్య బలవన్మరణం | wife suicides after her husband dies | Sakshi
Sakshi News home page

భర్త వియోగంతో భార్య బలవన్మరణం

Oct 21 2016 11:04 PM | Updated on Sep 4 2017 5:54 PM

భర్త వియోగంతో భార్య బలవన్మరణం

భర్త వియోగంతో భార్య బలవన్మరణం

భర్త లేని జీవితం తనకు వద్దని భార్య బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం మల్లాపురంలో వెలుగు చూసింది.

రాయదుర్గం రూరల్‌ : భర్త లేని జీవితం తనకు వద్దని భార్య బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం మల్లాపురంలో వెలుగు చూసింది. గుమ్మఘట్ట మండలం 75 వీరాపురానికి చెందిన గురుప్రపసాద్‌తో  మల్లాపురం సమీపంలోని కుంటు మారెమ్మ గుడివద్ద నివాసముంటున్న శారదకు ఏడాదిన్నర క్రి తం వివాహమైంది. గత నెల ఆరో తేదీన కుంటు మారెమ్మ గుడి సమీపంలో గురుప్రసాద్‌ ద్విచక్రవాహనంపై అదుపుతప్పి గాయపడ్డాడు.

రాయదుర్గం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పదో తేదీ అతను మతి చెందాడు. అప్పటి నుంచి శారద దిగులుతో ఉండేది. ఒంటరి జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement