మండలంలోని పసలపూడిలో భార్యాభర్తలు గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో భార్య మృతి చెందగా, భర్త ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తలెత్తిన వివాదమే ఆత్మహత్యలకు కారణంగా స్థానికులు భావిస్తున్నారు.
-
భార్య మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త
-
పసలపూడిలో ఘోరం
-
కుటుంబ తగాదాలే కారణమా?
పసలపూడి(రాయవరం) :
మండలంలోని పసలపూడిలో భార్యాభర్తలు గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో భార్య మృతి చెందగా, భర్త ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తలెత్తిన వివాదమే ఆత్మహత్యలకు కారణంగా స్థానికులు భావిస్తున్నారు. గ్రామానికి చెందిన కోనాల ఈశ్వరరెడ్డికి అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన సత్యతో వివాహమైంది. వీరికి ఎనిమిది, ఆరు సంవత్సరాల వయస్సున్న ఇద్దరు కుమార్తెలున్నారు. పేద కుటుంబానికి చెందిన ఈశ్వరరెడ్డి చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు చేసేవాడని తెలిసింది. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య ఆర్ధిక కారణాల నేపథ్యంలో కుతుకులూరులో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం పసలపూడి వచ్చిన భార్యాభర్తల మధ్య ఏమి జరిగిందో తెలియదు ... గురువారం మధ్యాహ్నం భార్య సత్య ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందగా భార్య మరణించిన విషయం తెలుసుకున్న భర్త ఈశ్వరరెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు ఎలుకల మందు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు బిక్కవోలు మండలం పందలపాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈశ్వరరెడ్డి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఏఎస్సై కె.వి.వి.సత్యనారాయణను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.