వైసీపీలోకి వలసల వెల్లువ | Waves of immigration in YCP | Sakshi
Sakshi News home page

వైసీపీలోకి వలసల వెల్లువ

Mar 15 2014 4:02 AM | Updated on Aug 10 2018 8:01 PM

వైసీపీలోకి వలసల వెల్లువ - Sakshi

వైసీపీలోకి వలసల వెల్లువ

భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ ఖాళీ కాగా.. తాజాగా టీడీపీ నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరుతున్నారు.

భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ ఖాళీ కాగా.. తాజాగా టీడీపీ నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరుతున్నారు. ముఖ్యంగా భీమవరం పట్టణంలో టీడీపీ ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే పలు వార్డులకు చెందిన టీడీపీ నాయకులు వైసీపీలో చేరగా తాజాగా ఒకటో వార్డు, 18వ వార్డులకు చెందిన టీడీపీ నాయకులు శుక్రవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్, ప్రముఖ న్యాయవాది కామన నాగేశ్వరరావు, ముత్యాల వెంకట రామారావుల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరారు.
 
  కామన రాంబాబు, మేకా త్రినాథ్, వీరవల్లి సుబ్బారాయుడు, సామన భాస్కరరావు, పోలిశెట్టి ఏడుకొండలు, మేకా మధు, మట్టా సుబ్బారావు, మేకా నరసింహారావు, ముద్దే మధు, యాతం ఏసు, మణికంఠ సతీష్, నంది నాగరాజు, కఠారి చిన్ని, యాతం సురేష్, లక్ష్మణరావు, వేమవరపు శ్రీనివాసరావు, నక్కా శివశంకర్ తదితరులు వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు. వారందరికీ గ్రంధి శ్రీనివాస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీపై ప్రజలు ఎనలేని ఆదరణ చూపిస్తున్నారన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజనకు కారకులయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్, మద్దాల రమణ, వర్ధినీడి సత్యనారాయణ, షేక్ అన్సారీ, ఇంటి సత్యనారాయణ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement