వృథాగా నీటి సంపులు | water volumes are un used | Sakshi
Sakshi News home page

వృథాగా నీటి సంపులు

Sep 19 2016 5:59 PM | Updated on Sep 4 2017 2:08 PM

రంగంపేటలో శిథిలావస్థలో సంపు

రంగంపేటలో శిథిలావస్థలో సంపు

గ్రామాల్లో ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న రక్షిత మంచినీటి ట్యాంకులు, సంపులు వృథాగా మారి ప్రజాధనం వృథాగా మారుతున్నాయి.

కొల్చారం: గ్రామాల్లో ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న రక్షిత మంచినీటి ట్యాంకులు, సంపులు వృథాగా మారి ప్రజాధనం వృథాగా మారుతున్నాయి. మండలంలోని రంగంపేట గ్రామంలో 12 ఏళ్ల క్రితం రూ.10 లక్షలు వెచ్చించి సంపు నిర్మించారు. నాటి నుంచి నేటికీ సంపును ఉపయోగంలోకి తేవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.

ప్రస్తుతం సంపు పరిస్థితి దారుణంగా తయారైంది. ఎక్కడికక్కడ పెచ్చులూడి ఏ క్షణంలోనైనా కూలడానికి సిద్ధంగా ఉంది సంపు. చిన్నఘనాపూర్‌ గ్రామంలో ఏడాది క్రితం పాఠశాల ఆవరణలో ప్రజా అవసరాల కోసం సంపును నిర్మించినా ఇప్పటికి వినియోగంలోకి తేవడం లేదు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి మాత్రమే సంపుల నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement