breaking news
un-used
-
లక్షలు వెచ్చించి.. లక్షణంగా వదిలేశారు!
మూలపడిన ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు తొగుట: రైతులు మార్కెట్కు తెచ్చిన ధాన్యం శుభ్రపరించేందుకు యంత్రాలను లక్షలు వెచ్చించి కొన్నారు... అధికారుల నిర్లక్షంతో మూలకు పడేశారు. దీంతో ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు వానకు నాని, ఎండకు ఎండి తుప్పుపడుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం మండలంలోని వివిద గ్రామాలలో మహిళా సంఘాల ఆద్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యం శుభ్రపరిచేందుకు స్థానిక వ్యవసాయ మార్కేట్ నుంచి వీటిని తీసుకు పోయారు. కొనుగోలు ముగియగానే వాటిని మార్కెట్కు అప్పగించాల్సి ఉండగా, ఆయా కొనుగోలు కేంద్రాలు ముగియగానే వాటిని అక్కడే మూలకు పడేశారు. దీంతో నిర్వాహకులు దాని అవసరం తీరాక అక్కడే వదిలేసి పోవడంతో లక్షలు విలువైన యంత్రాలు పాడైపోతున్నాయి. సుమారు పదేండ్ల క్రితం తొగుట వ్వయసాయ మార్కేట్ కమిటీ అదికారులు 27 యంత్రాలను కొనుగోలు చేశారు. అందులో 12 యంత్రాలను మండలంలోని పెద్దమాసాన్పల్లి, ఎల్లారెడ్డిపేట, బండారుపల్లి, ఘణపురం, కాన్గల్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లేపహడ్, వెంకట్రావుపేట, లింగాపూర్, జప్తిలింగారెడ్డిపల్లి, లింగంపేట గ్రామల ఐకేపీ సంఘాలకు అప్పగించారు. దీంతో ఆయా గ్రామాల్లోని ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు మూలకే పడ్డాయి. మళ్లీ సీజన్ ప్రారంభం అయినప్పుడే వాటి విలువ అధికారులకు తెలిసివస్తుంది! అప్పుడు అధికారులు వాటి రిపేర్ల పేరుతో డబ్బులు వెచ్చిస్తారు. తప్పా వాటిని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత అధికారులకు లేకపోవడం సోచనీయం. -
వృథాగా నీటి సంపులు
కొల్చారం: గ్రామాల్లో ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న రక్షిత మంచినీటి ట్యాంకులు, సంపులు వృథాగా మారి ప్రజాధనం వృథాగా మారుతున్నాయి. మండలంలోని రంగంపేట గ్రామంలో 12 ఏళ్ల క్రితం రూ.10 లక్షలు వెచ్చించి సంపు నిర్మించారు. నాటి నుంచి నేటికీ సంపును ఉపయోగంలోకి తేవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రస్తుతం సంపు పరిస్థితి దారుణంగా తయారైంది. ఎక్కడికక్కడ పెచ్చులూడి ఏ క్షణంలోనైనా కూలడానికి సిద్ధంగా ఉంది సంపు. చిన్నఘనాపూర్ గ్రామంలో ఏడాది క్రితం పాఠశాల ఆవరణలో ప్రజా అవసరాల కోసం సంపును నిర్మించినా ఇప్పటికి వినియోగంలోకి తేవడం లేదు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి మాత్రమే సంపుల నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు.