మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident At Kolcharam Mandal Near Medak District | Sakshi
Sakshi News home page

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Oct 1 2020 8:15 PM | Updated on Oct 1 2020 8:32 PM

Road Accident At Kolcharam Mandal Near Medak District - Sakshi

సాక్షి, మెదక్‌ : జిల్లాలోని కొల్చారం మండలంలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.హైదరాబాద్ నుండి మెదక్ వైపు వేగంగా వస్తున్న కారు.. మెదక్ నుంచి కిష్టాపూర్ వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాద సమయంలో ఆటోలో 9 మంది ఉ‍న్నట్లు తెలుస్తుంది. చనిపోయినవారిలో మండలంలోని కిష్టాపూర్‌కు చెందిన చాకలి శ్రీవర్శిని(2),వారిగుంతమ్ గ్రామానికి చెందిన ముత్యాల నిర్మల(46), అప్పాజీపల్లి గ్రామానికి చెందిన అతినగరం సుమలత(25) అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందాడు.

కిష్టాపూర్ కు చెందిన తల్లీ కుమారుడు చాకలి ఇందిర, చాకలి వర్షిత్, వారిగుంతమ్ గ్రామానికి చెందిన ముత్యాల స్వామి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నా ప్రమాదం జరిగిన చోటు అంతా చీకటిగా ఉండడంతో కాస్త ఇబ్బంది ఏర్పడింది. అయితే స్థానికుల సెల్‌ఫోన్ల లైట్ల ఆధారంగా గాయపడ్డవారిని పోలీసులు మొదట మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించినా.. పరిస్థితి విషమించడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.(చదవండి : అసెంబ్లీ సాక్షిగా తల్లి మెడపై కత్తి పెట్టి..)

Advertisement
 
Advertisement
Advertisement