
విజయసాయిరెడ్డికి సాదర స్వాగతం
విశాఖ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ) : విశాఖ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డికి సాదర స్వాగతం లభించింది.
ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనను ఇక్కడ నియోజకవర్గ సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి జీవీ రవిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రొంగలి జగన్నాథం, కంపా హనోక్, కేంద్ర కమిటీ సభ్యుడు ప్రగడ నాగేశ్వరరావు, నగర ప్రచార కమిటీ అధ్యక్షుడు బర్కత్ అలీ, నగర బీసీ సెల్ మాజీ కన్వీనర్ పక్కి దివాకర్ తదితర నాయకులు, ఏయూ విద్యార్థి సంఘ నేతలు, పలు వార్డుల అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.