వరంగల్ వార్ వన్ సైడే... | war one side in Warangal by-poll | Sakshi
Sakshi News home page

వరంగల్ వార్ వన్ సైడే...

Nov 24 2015 10:34 AM | Updated on Mar 29 2019 9:31 PM

వరంగల్ వార్ వన్ సైడే... - Sakshi

వరంగల్ వార్ వన్ సైడే...

ఓరుగల్లు ఉప ఎన్నిక పోరులో కారు దూసుకెళుతోంది. ఊహించని విధంగా కారు టాప్‌ గేర్‌లో వెళ్తోంది. దీంతో వార్ వన్ సైడే అయ్యింది. ఓట్ల లెక్కింపులో తొలి నుంచీ టిఆర్‌ఎస్‌ ఆధిక్యంలోనే వుంది.

వరంగల్ : ఓరుగల్లు ఉప ఎన్నిక పోరులో కారు దూసుకెళుతోంది. ఊహించని విధంగా కారు టాప్‌ గేర్‌లో వెళ్తోంది. దీంతో వార్ వన్ సైడే అయ్యింది. ఓట్ల లెక్కింపులో తొలి నుంచీ టిఆర్‌ఎస్‌ ఆధిక్యంలోనే వుంది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో, పాత మెజార్టీని అధిగమించే దిశగా కారు జోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్‌ అభ్యర్ధి పసునూరి దయాకర్‌ మూడు లక్షల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.

 

కాంగ్రెస్‌ రెండో స్థానంలో, బిజెపి మూడో స్థానంలో వున్నాయి. ప్రతి సెగ్మెంట్‌లోనూ...ప్రతి రౌండ్‌లోనూ టిఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ కనపడుతోంది. గట్టి పోటీనిస్తామని చివరి వరకు చెప్పుకొచ్చిన కాంగ్రెస్‌ భారీ తేడాతో రెండో స్థానంతో సరిపెట్టుకుంటోంది. కాగా నాలుగు రౌండ్ల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement