రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో ఏసీబీకి చిక్కిన సంఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది.
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
Aug 8 2016 3:06 PM | Updated on Aug 17 2018 12:56 PM
పెద్దపల్లి: రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో ఏసీబీకి చిక్కిన సంఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. మండలంలోని రంగాపూర్ వీఆర్వోగా పని చేస్తున్న గౌస్‌పాషా అదే గ్రామానికి చెందిన ఓ రైతుకు సంబంధించిన పాస్ పుస్తకాల్లో మార్పులు చేయడానికి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు గౌస్‌పాషా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం విచారణ చేపడుతున్నారు.
Advertisement


