వైభవంగా విశ్వకర్మ విగ్రహ నిమజ్జనం | viswakarma statue immersion | Sakshi
Sakshi News home page

వైభవంగా విశ్వకర్మ విగ్రహ నిమజ్జనం

Sep 21 2016 6:58 PM | Updated on Aug 3 2018 2:57 PM

నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న స్వర్ణకారులు - Sakshi

నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న స్వర్ణకారులు

సదాశివపట్టణం హనుమాన్‌ నగర్‌ కాలనీలోని వీరబ్రహ్మం మందిరంలో ఈ నెల 17న ప్రతిష్టించిన విశ్వకర్మ విగ్రహాన్ని బుధవారం నిమజ్జనం చేశారు.

సదాశివపేట: సదాశివపట్టణం హనుమాన్‌ నగర్‌ కాలనీలోని  వీరబ్రహ్మం మందిరంలో ఈ నెల 17న ప్రతిష్టించిన విశ్వకర్మ విగ్రహాన్ని బుధవారం నిమజ్జనం చేశారు.  స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో మందిరం నుంచి ప్రారంభమైన నిమజ్జన ఊరేగింపు వికారాబాద్‌ రోడ్డు, 65వ నంబర్‌ జాతీయ రహదారి, తిలక్‌రోడ్డు, గాంధీరోడ్డు మీదుగా శంభులింగేశ్వర మందిరం వరకు ఊరేగింపు నిర్వహించారు, సాయంత్రం శంభులింగేశ్వర మందిరం ఎదుట విశ్వకర్మ విగ్రహానికి చివరగా పూజలు నిర్వహించి బావిలో నిమజ్జనం చేశారు. 

కార్యక్రమంలో స్వర్ణకార సంఘం జిల్లా కార్యదర్శి, పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మెదక్‌ శ్రీనివాస్‌చారి, జిల్లా ఉపాధ్యక్షుడు మామిడిరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి పట్టణ యువత అధ్యక్షుడు మెదక్‌ సందీప్‌చారి, పట్టణ ప్రధాన కార్యదర్శి అంబదాస్, పట్టణ యువత ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌చారి, నాయకులు సంగమేశ్వర్, భోగేశ్, నర్సింగ్‌రావు, సురేశ్‌చారి, పట్టణ స్వర్ణకార సంఘం నాయకులు తదితరులు నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement