శిథిలావస్థలో పశువైద్యశాల | veternary hospital collapsed | Sakshi
Sakshi News home page

శిథిలావస్థలో పశువైద్యశాల

Sep 10 2016 5:59 PM | Updated on Sep 4 2017 12:58 PM

రాంపూర్‌ గ్రామంలో పశువైద్యశాల

రాంపూర్‌ గ్రామంలో పశువైద్యశాల

కొల్చారం మండలం రాంపూర్‌ గ్రామంలోని పశువైద్యశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి మధ్య కొనసాగుతోంది.

కొల్చారం : కొల్చారం మండలం రాంపూర్‌ గ్రామంలోని పశువైద్యశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి మధ్య కొనసాగుతోంది. భవనం పైకప్పు బీటలువారింది. వర్షం పడిందంటే నీరంతా భవనంలోని గోడల వెంట కారుతోంది. విలువైన మందులు, దాణా తడుస్తోంది. రాంపూర్‌, కిష్టాపూర్‌ గ్రామాలకు అనుబంధంగా ఉన్న ఈ పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పశువులకు మెరుగైన మందులు అందడం లేదు.

ఈ గ్రామాల రైతులు పశువులకు వైద్యం చేయించేందుకు సమీపంలోని మెదక్‌ మండలం మాచవరం గ్రామానికి తీసుకెళ్లాల్సి వస్తోంది. నూతన భవనం మంజూరు చేసి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement