వసంతోత్సవం ప్రారంభం | vasanthotsavam starts at tirupati | Sakshi
Sakshi News home page

వసంతోత్సవం ప్రారంభం

Apr 8 2017 4:42 PM | Updated on Sep 5 2017 8:17 AM

తిరుమలలోని వసంత మండపంలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది.

తిరుమల: తిరుమలలోని వసంత మండపంలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. శనివారం నుంచి జరుగుతున్న ఈ వేడుకల కోసం వసంత మండపంలో టీటీడీ ఉద్యాన శాఖ భారీ అలంకరణలు చేపట్టింది. ఈవో డి.సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు సూచనల మేరకు ఉద్యాన శాఖ పర్యవేక్షకులు శ్రీనివాసులు ఈ అలంకరణను పర్యవేక్షించారు.

వసంత మండపాన్ని ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా రూపొందించారు. రకరకాల జంతువులు, వృక్షాలు, ప్రకృతిలోని జంతువులన్నీ విచ్చేసినట్లుగా మండపాన్ని తీర్చిదిద్దారు. వసంతోత్సవ వేదికను సువాసనలను వెదజల్లే, చల్లదనాన్ని కల్పించే వట్టివేర్లతో అల్లారు. రంగురంగుల పుష్పాలను ఉత్సవాలకు తీసుకువచ్చారు. సహజత్వం ఉట్టిపడేలా వసంత మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మూడు రోజులపాటు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు తితిదే ప్రకటించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement