ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దు | upadhi sceme | Sakshi
Sakshi News home page

ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దు

Aug 1 2016 12:06 AM | Updated on Sep 15 2018 4:22 PM

ఆత్మకూరురూరల్‌ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దని కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జి.లక్ష్మీపతి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.పుల్లయ్య డిమాండ్‌ చేశారు.

 
ఆత్మకూరురూరల్‌ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దని కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జి.లక్ష్మీపతి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.పుల్లయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం  పట్టణంలోని డాక్టర్‌ చెర్లో రమణారెడ్డి భవన్‌లో జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ, అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో పాలకులు అవలంబిస్తున్న విధానాల వల్ల వ్యవసాయ కార్మికుల జీవన స్థితిగతులు అగమ్యగోచరంగా తయారయ్యాయన్నారు. పేద ప్రజలు, వ్యవసాయ కార్మికుల కోసం తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, నామమాత్రంగా నిధులు కేటాయిస్తున్నాయన్నారు. వ్యవసాయంలో కీలకమైన కూలీలకు కనీసవేతనాలు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా పేదలకు అందడం లేదని ఆరోపించారు. మరోవైపు నిత్యావసరాల ధరలు పెరిగాయన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శిలుగా గొరిపర్తి పెంచలయ్య, కార్యదర్శిగా ముత్యాల పెంచలయ్య, కమిటీ సభ్యులుగా పి.పెంచల రామయ్య, టి.రవి, పి.వెంకటయ్య, జి.రమణమ్మ, కత్తి ఎల్లయ్యలను నియమించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు ఎం.నాగేంద్ర, కేవీపీఎస్‌ నాయకులు కె.డేవిడ్‌రాజు, మహిళా సంఘం నాయకులు షేక్‌ గుల్జార్‌బేగం పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement