మామిడి తోటలో గుర్తుతెలియని మహిళ శవం | unkonwn women dedboy in mango field | Sakshi
Sakshi News home page

మామిడి తోటలో గుర్తుతెలియని మహిళ శవం

Jul 27 2016 11:58 PM | Updated on Oct 9 2018 4:55 PM

కోరుట్ల రూరల్‌ : మండలంలోని కల్లూర్‌రోడ్‌ మాదాపూర్‌ శివారులోని మామిడి తోటలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని బుధవా రం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామ శివారులోని ఓ మామిడి తోట నుంచి దుర్వాసన రావడంతో సమీపంలో పనిచేస్తున్న కూలీలు వెళ్లి చూశారు. తోటలో ఉన్న షెడ్డులో కుళ్లి పోయిన మహిళ మృత దేహం కనిపించిం ది

కోరుట్ల రూరల్‌ :  మండలంలోని కల్లూర్‌రోడ్‌ మాదాపూర్‌ శివారులోని మామిడి తోటలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని బుధవా రం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామ శివారులోని ఓ మామిడి తోట నుంచి దుర్వాసన రావడంతో సమీపంలో పనిచేస్తున్న కూలీలు వెళ్లి చూశారు. తోటలో ఉన్న షెడ్డులో కుళ్లి పోయిన మహిళ మృత దేహం కనిపించిం ది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై బాబూరావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముఖం పూర్తిగా కుళ్లిపోవడంతో గుర్తుపట్టలేకుండా ఉంది. ఒంటి పై నీలి రంగు చీర, ఎడమ చేతికి వాచీ ఉంది. మహిళ వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా  పోలీసులు అనుమానిస్తున్నారు.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement