శంకరపట్నం మండలం ఇప్పలపల్లె శివారులో అండర్ టన్నెల్ వద్ద సొరంగం పూడ్చివేత పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. ‘అండర్‌టన్నెల్‌కు సొరంగం’ శీర్షికన మంగళవారం సాక్షిలో కథనం ప్రచురితమవడంతో బుధవారం ఎస్సారెస్పీ ఈఈ శ్రీనివాస్ సొరంగం పడ్డ అండర్‌టన్నెల్‌ను పరిశీలించారు.
అండర్‌టన్నెల్ సొరంగం పూడ్చివేత ప్రారంభం
Jul 20 2016 11:42 PM | Updated on Sep 4 2017 5:29 AM
శంకరపట్నం: శంకరపట్నం మండలం ఇప్పలపల్లె శివారులో అండర్ టన్నెల్ వద్ద సొరంగం పూడ్చివేత పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. ‘అండర్‌టన్నెల్‌కు సొరంగం’ శీర్షికన మంగళవారం సాక్షిలో కథనం ప్రచురితమవడంతో బుధవారం ఎస్సారెస్పీ ఈఈ శ్రీనివాస్ సొరంగం పడ్డ అండర్‌టన్నెల్‌ను పరిశీలించారు. ఎస్సారెస్పీ ప్రధానకాలువ అండర్‌టన్నెల్‌కు 172.65 కిలోమీటర్ వద్ద సొరంగం పడింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘సాక్షి’ కథనంతో స్పందించిన ఈఈ శ్రీనివాస్ ప్రదాన కాలువను పరిశీలించి స్కిన్‌వాల్ నిర్మాణం ప్రారంభించి వారంలోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. కాలువ లైనింగ్ పనులు కూడా చేపడతామన్నారు. ఆయన వెంట డీఈ కవిత, ఏఈలు వేణు, రవికాంత్ ఉన్నారు.
Advertisement
Advertisement