‘అండర్‌–19’ విజేత నారాయణ | under-19 winner NARAYANA | Sakshi
Sakshi News home page

‘అండర్‌–19’ విజేత నారాయణ

Oct 27 2016 11:12 PM | Updated on Sep 4 2017 6:29 PM

‘అండర్‌–19’ విజేత నారాయణ

‘అండర్‌–19’ విజేత నారాయణ

ఒంగోలు: అండర్‌–19 సెంట్రల్‌ జోన్‌ విజేతగా ఒంగోలు నారాయణ జూనియర్‌ కాలేజీ జట్టు నిలిచింది. స్థానిక ఏబీఎం డిగ్రీ కాలేజీలో గురువారం సెంట్రల్‌ జోన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది.

 
ఒంగోలు: అండర్‌–19 సెంట్రల్‌ జోన్‌ విజేతగా ఒంగోలు నారాయణ జూనియర్‌ కాలేజీ జట్టు నిలిచింది. స్థానిక ఏబీఎం  డిగ్రీ కాలేజీలో గురువారం సెంట్రల్‌ జోన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. కందుకూరు టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ  ఒంగోలు నారాయణ జట్టు మధ్య జరిగిన మ్యాచ్‌లో కందుకూరు తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత ఓవర్లలో 59 పరుగులు చేసి టీఆర్‌ఆర్‌ జట్టు ఆలౌటయింది.
 
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నారాయణ జట్టు 11 ఓవర్లలో లక్షా్యన్ని ఛేదించి జయకేతనం ఎగురవేసింది. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన జట్లను ఆర్‌ఐఓ రమేశ్‌బాబు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటూ ఆటల్లోనూ రాణించి ఉజ్వల భవిష్యత్‌ సాధించాలని ఆకాంక్షించారు.
 
అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి ఎం హరనాథబాబు, ఏబీఎం జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ మోజెస్‌ దయానందం,  ఫిజికల్‌ డైరెక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ వెంకటేశ్వరరావు, కార్యదర్శి నరసింహారావు, ఏబీఎం జూనియర్‌ కాలేజీ పీడీ కే డేవిడ్‌రాజు, రాజు, కాశీరత్నం పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement