
అండర్–15చెస్ టోర్నీ విజేతలు వీరే
గ్లోబల్ చెస్ అకాడమీలో శనివారం జరిగిన జిల్లా అండర్ –15 బాలబాలికల చెస్ పోటీల్లో బాలుర విభాగంలో జె.అక్షిత్‌కుమార్ విజేతగా నిలువగా, తరువాతి స్థానాలను ఆర్.ప్రణీత్, బీజేఎస్‌కే రణధీర్, కె. అభినవ చంద్ర సాధించారు.
విజయవాడ స్పోర్ట్స్ : గ్లోబల్ చెస్ అకాడమీలో శనివారం జరిగిన జిల్లా అండర్ –15 బాలబాలికల చెస్ పోటీల్లో బాలుర విభాగంలో జె.అక్షిత్‌కుమార్ విజేతగా నిలువగా, తరువాతి స్థానాలను ఆర్.ప్రణీత్, బీజేఎస్‌కే రణధీర్, కె. అభినవ చంద్ర సాధించారు. బాలికల విభాగంలో ఎన్.సాత్విక విజేతగా నిలువగా, సీహెచ్.శ్రావణి, జి.హర్షితదేవి, బి.సద్భావన తరువాతి స్థానాలను పొందారు. వీరంతా ఈనెల 4 నుంచి 6వ తేదీ వరకు కడపలో జరిగే ఏపీ స్టేట్ చాలెంజర్స్ చెస్ టోర్నీలో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని గ్లోబల్ చెస్ అకాడమీ కార్యదర్శి ఎస్‌కె.ఖాసీం తెలిపారు టోర్నీ అనంతరం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ భాస్కరరావు, డాక్టర్ వందన, ఏపీ చెస్ అసోసియేషన్ కార్యదర్శి డి.శ్రీహరి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.