dist level competitions
-
అండర్–15చెస్ టోర్నీ విజేతలు వీరే
విజయవాడ స్పోర్ట్స్ : గ్లోబల్ చెస్ అకాడమీలో శనివారం జరిగిన జిల్లా అండర్ –15 బాలబాలికల చెస్ పోటీల్లో బాలుర విభాగంలో జె.అక్షిత్కుమార్ విజేతగా నిలువగా, తరువాతి స్థానాలను ఆర్.ప్రణీత్, బీజేఎస్కే రణధీర్, కె. అభినవ చంద్ర సాధించారు. బాలికల విభాగంలో ఎన్.సాత్విక విజేతగా నిలువగా, సీహెచ్.శ్రావణి, జి.హర్షితదేవి, బి.సద్భావన తరువాతి స్థానాలను పొందారు. వీరంతా ఈనెల 4 నుంచి 6వ తేదీ వరకు కడపలో జరిగే ఏపీ స్టేట్ చాలెంజర్స్ చెస్ టోర్నీలో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని గ్లోబల్ చెస్ అకాడమీ కార్యదర్శి ఎస్కె.ఖాసీం తెలిపారు టోర్నీ అనంతరం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ భాస్కరరావు, డాక్టర్ వందన, ఏపీ చెస్ అసోసియేషన్ కార్యదర్శి డి.శ్రీహరి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. -
కబడ్డీ విజేత విజయవాడ జట్టు
కొత్త ఈదర (ఆగిరిపల్లి): మండల పరిధిలోని కొత్త ఈదరలో ఈ నెల 26 నుంచి జరుగుతున్న జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో విజయవాడ స్టేడియం జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం రాత్రి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా వైఎస్సార్ సీపీ నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీని మరింతగా ఆదరించాలని, దీని ద్వారా ఆణిముత్యాల్లాంటి ఆటగాళ్లు తయారవుతారని అన్నారు. ఫైనల్స్లో కొత్త ఈదర జట్టుపై విజయవాడ స్టేడియం జట్టుకు జయకేతనం ఎగురవేసింది. విజయవాడ జట్టుకు ప్రథమ బహుమతిగా రూ.10,116లు, ద్వితీయ బహుమతిని కొత్త ఈదర జట్టు రూ.5,116లు, నూజివీడు ట్రిపుల్ ఐటీ జట్టు (తృతీయ) రూ.3,116లు ఎమ్మెల్యే బహూకరించారు.