కబడ్డీ విజేత విజయవాడ జట్టు | kabaddi winner vijayawada team | Sakshi
Sakshi News home page

కబడ్డీ విజేత విజయవాడ జట్టు

Oct 29 2016 11:26 PM | Updated on Sep 4 2017 6:41 PM

కబడ్డీ విజేత విజయవాడ జట్టు

కబడ్డీ విజేత విజయవాడ జట్టు

మండల పరిధిలోని కొత్త ఈదరలో ఈ నెల 26 నుంచి జరుగుతున్న జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో విజయవాడ స్టేడియం జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం రాత్రి ఫైనల్‌ పోటీలకు ముఖ్య అతిథిగా వైఎస్సార్‌ సీపీ నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు హాజరయ్యారు.



కొత్త ఈదర (ఆగిరిపల్లి): మండల పరిధిలోని కొత్త ఈదరలో ఈ నెల 26 నుంచి జరుగుతున్న జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో విజయవాడ స్టేడియం జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం రాత్రి  ఫైనల్‌ పోటీలకు ముఖ్య అతిథిగా వైఎస్సార్‌ సీపీ నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీని మరింతగా ఆదరించాలని, దీని ద్వారా ఆణిముత్యాల్లాంటి ఆటగాళ్లు తయారవుతారని అన్నారు. ఫైనల్స్‌లో కొత్త ఈదర జట్టుపై విజయవాడ స్టేడియం జట్టుకు జయకేతనం ఎగురవేసింది. విజయవాడ జట్టుకు ప్రథమ బహుమతిగా రూ.10,116లు, ద్వితీయ బహుమతిని కొత్త ఈదర జట్టు రూ.5,116లు, నూజివీడు ట్రిపుల్‌ ఐటీ జట్టు (తృతీయ) రూ.3,116లు ఎమ్మెల్యే బహూకరించారు.







 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement