ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మాంజ్రి గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఎడ్లబండిని లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మాంజ్రి గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఎడ్లబండిని లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. మాంజ్రి గ్రామానికి చెందిన తొమ్మిది మంది పాంగ్రి గ్రామ పంచాయతీలోని ఆలయాల్లో భజన కార్యక్రమాలు ముగించుకుని 1 గంట సమయంలో తిరిగి స్వగ్రామానికి వెళుతున్నారు. ఆ క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఎడ్లబండిని ఢీకొంది. ధర్మాజీ, ఉత్తమ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. వారిని భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు.