గంజాయితో ఇద్దరి అరెస్టు | two arrested with ganjayi | Sakshi
Sakshi News home page

గంజాయితో ఇద్దరి అరెస్టు

Jul 21 2016 12:13 AM | Updated on Aug 20 2018 4:27 PM

పట్టుబడ్డ గంజాయి - Sakshi

పట్టుబడ్డ గంజాయి

ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కొనమర్రి గ్రామానికి చెందిన తళియాడు పవిత్రదొర, అతని భార్య తళియాడు ఈశ్వరిదొరలను 10 కిలోల గంజాయితో అరెస్టు చేశామని పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ కె.మధుసూదనరావు బుధవారం చెప్పారు.

పలాస : ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కొనమర్రి గ్రామానికి చెందిన తళియాడు పవిత్రదొర, అతని భార్య తళియాడు ఈశ్వరిదొరలను 10 కిలోల గంజాయితో అరెస్టు చేశామని పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ కె.మధుసూదనరావు బుధవారం చెప్పారు. వీరు గంజాయిని ముంబై తీసుకు వెళ్లేందుకు పలాస రైల్వేస్టేషన్‌లో నిరీక్షిస్తుండగా పట్టుకున్నామని ఆయన చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. వీరిని విశాఖపట్నం కోర్టులో హాజరుపరుస్తామని ఎస్‌ఐ చెప్పారు. 
 
పర్లాఖిముండికి చెందిన విజయమండల్‌ను నాలుగు కిలోల గంజాయితో బుధవారం అరెస్టు చేశామని కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్‌ చెప్పారు. నిందితుడు కాశీబుగ్గ సాయిబాబా గుడి దగ్గర ఒక సూట్‌ కేసు పట్టుకొని నిల్చుని ఉండగా అటుగా వెళ్తున్న కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్, ఎస్‌ఐ కె.వి.సురేష్, సిబ్బంది అనుమానంతో ఆ సూట్‌æకేసును తనిఖీ చేశారు. దీంతో సూట్‌కేసులో నాలుగు కిలోల గంజాయి దొరికిందని సీఐ చెప్పారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి, గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement