ఏటీ అగ్రహారంలో తప్పిన ప్రమాదం | Transformer blast due to shotcurcuit in agraharam | Sakshi
Sakshi News home page

ఏటీ అగ్రహారంలో తప్పిన ప్రమాదం

Jun 28 2016 8:56 PM | Updated on Sep 4 2017 3:38 AM

గుంటూరు జిల్లాలోని ఏటీ అగ్రహారంలో పెద్ద ప్రమాదమే తప్పింది.

గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఏటీ అగ్రహారంలో పెద్ద ప్రమాదమే తప్పింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఏటీ అగ్రహారంలో ఓ చెట్లకొమ్మ విరిగి పడటంతో ఏడు విద్యుత్‌ స్తంభాలు నేలకు ఒరిగాయి.

ఈ నేపథ్యంలో విద్యుత్‌ తీగలు ఒకదానికొకటి తగలడంతో షార్ట్‌ సర్క్యూట్‌ అయింది. దాంతో దగ్గరలోని ట్రాన్స్‌ఫార్మర్‌లో పెద్ద ఎత్తునా మంటలు చెలరేగాయి. ఘటన స్థలికి దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement