మండలంలోని బీబీపేటను మండలంగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కోరుతూ
దోమకొండ:
మండలంలోని బీబీపేటను మండలంగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కోరుతూ శనివారం ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమానులు గ్రామంలోని ప్రధాన రోడ్లపై ట్రాక్టర్‌లను తిప్పి బీబీపేటను మండలంగా చేయాలంటూ నినాదాలు చేశారు. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.